హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూ.గో, ప.గో, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ప్రకటించింది. ఏలూరు, కృష్ణా, NTR, GNT, ప్రకాశం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.