హైదరాబాద్: 28°C
వార్తలు

హైడ్రామా.. కేజ్రీవాల్‌ను అడ్డుకున్న పోలీసులు

ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. ప్రధాని మోదీ నివాసానికి ఆప్ అధినేత కేజ్రీవాల్ పాదయాత్ర చేపట్టారు. E-20 పెట్రోల్‌పై ప్రధానికి వినతిపత్రం ఇవ్వటానికి వెళ్తున్నట్లు తెలిపారు. మోదీ నివాసం వైపు ర్యాలీగా వెళ్తుండడంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌ను అడ్డుకున్నారు. దీంతో కేజ్రీవాల్, ఆప్ నేతలు సిసోడియా, సంజయ్ సింగ్ రోడ్డుపై బైఠాయించారు.