హైదరాబాద్: 28°C
వార్తలు

CRPF క్యాంపులో కాల్పులు.. ముగ్గురు మృతి

అసోం నాగావ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. CRPF క్యాంపులో ఓ అధికారి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. సహచరులపై కాల్పులు జరిపిన తర్వాత ఆ అధికారి తన తుపాకీతో తాను కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కాల్పులకు గలకారణాలు తెలియాల్సి ఉంది.