SRD: సిర్గాపూర్ మండల మెడికల్ ఆఫీసర్ డా.నిఖిత ప్రజలకు నేడు ముఖ్య సూచనలు చేశారు. ప్రస్తుత భారీ వర్షాలతో నీరు కలుషితమవుతాయని, ఏ నీటినైనా వేడి పెట్టి చల్లారక తాగాలని సూచించారు. అదేవిధంగా మనం తినే ఆహారంలో కొన్ని నిబంధనలు పాటించాలన్నారు. ముఖ్యంగా నూనె పదార్థాలు తినరాదని, స్పష్టమైన ఆరోగ్య సూత్రాలను పాటిస్తే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెప్పారు.
వార్తలు
'ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించాలి'


