హైదరాబాద్: 28°C
వార్తలు

గిద్దలూరులో బాణాసంచా గోదాం తనిఖీలు

ప్రకాశం: గిద్దలూరు అర్బన్ సీఐ సురేశ్ సోమవారం కే.ఎస్. పల్లిలోని సురేశ్ క్రాకర్స్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాణాసంచా నిల్వ, అగ్నిమాపక పరికరాలు, లైసెన్స్ నిబంధనలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు అన్ని భద్రతా ప్రమాణాలను తప్పని సరిగా పాటించాలని యాజమాన్యానికి సూచించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని సీఐ తెలిపారు.