హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు షాక్

పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పన్ను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ATF ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ కూడా పెంచింది. పెట్రోల్‌పై రూ.2.5 నుంచి రూ.3.5కు, డీజిల్‌పై రూ.15.5 నుంచి రూ.25.5కు.. ATF‌పై రూ.14.5 నుంచి రూ.22కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.