హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రైమరీ పాఠశాలకు సొంత భవనం నిర్మించాలి'

ఖమ్మం నగరంలోని 57వ డివిజన్ వికలాంగుల కాలనీ ప్రైమరీ పాఠశాలకు సొంత భవనం నిర్మించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ దివాకర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా వెంటనే నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు.