హైదరాబాద్: 28°C
వార్తలు

రేషన్ డీలర్ పై కేసు నమోదు.. రేషన్ దుకాణం సీజ్

KMM: కారేపల్లి మండలంలోని పలు రేషన్ దుకాణాలను సివిల్ సప్లై DT విజయబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీతారాంపురం రేషన్ షాపును పరిశీలించగా, నిల్వలు, రికార్డుల పరిశీలనలో 128 క్వింటాళ్లు 37 కిలోల బియ్యం వ్యత్యాసం గుర్తించారు. రేషన్ డీలర్ ఈసం కృష్ణపై 6-ఏ కేసు నమోదు చేసి, రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు.