హైదరాబాద్: 28°C
వార్తలు

భద్రాచలం దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక జారీ

TG: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 54.4 అడుగులకు చేరింది. ఇక్కడ 15.21 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉద్ధృతి కారణంగా భద్రాచలం నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.