E.G: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం పేర్కొన్నారు. ఆగస్టు 4న కోరుకొండ మండలం గాదరాడలో వివిధ ప్రముఖ కంపెనీల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ మేళా కొనసాగుతుందని చెప్పారు.
వార్తలు
ఆగష్టు 4న జాబ్ మేళా: MLA బత్తుల


