హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

TG: తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఇవాళ మోస్తరు వర్షం కురవనుంది. భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో విద్యాసంస్థలకు.. కలెక్టర్ ఇవాళ సెలవు ప్రకటించారు.