AP: అహోబిలం మఠం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆళ్లగడ్డ MLA భూమా అఖిలప్రియకు TDP అధిష్టానం స్పష్టంచేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చెప్పింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అహోబిలం మఠంలో తలనీలాల కాంట్రాక్ట్ సహా వివిధ అంశాల్లో ఎమ్మెల్యే జోక్యంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పార్టీ పెద్దలు ఆమెను విచారించారు.
వార్తలు
'అహోబిలం మఠంలో మీ జోక్యం వద్దు'


