హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి చేతుల మీదుగా ‘5కే ఏఎస్ఆర్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్’ పోస్టర్

VSP: రాష్ట్ర క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి '5కే ఏఎస్ఆర్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్' పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. యువతలో ఫిట్‌నెస్, క్రీడాస్ఫూర్తిని పెంచడంతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ద్వారా విశాఖను గ్లోబల్ గేట్‌వేగా చూపడమే దీని లక్ష్యమని చెప్పారు. జూలై 31న జరిగే ఈ రన్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.