హైదరాబాద్: 28°C
వార్తలు

చెక్ పవర్ కొనసాగించాలని వినతి

RR: పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం ఉప సర్పంచ్‌లకు కల్పించిన చెక్ పవర్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉప సర్పంచ్‌లు వినతి పత్రం సమర్పించారు. ఉప సర్పంచ్‌లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనం, వార్డు సభ్యులకు రూ.3,000 పారితోషికం కల్పించాలని కోరారు. గ్రామాభివృద్ధికి ఉప సర్పంచ్‌ల పాత్ర కీలకమని పేర్కొన్నారు.