ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసుల చర్యలపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళలు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు గాయపడిన ఘటనలతో పాటు 250 మంది పోలీసులపై జరిగిన దాడులనూ విచారించాలని తెలిపింది. ఈ మేరకు పారదర్శక దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది.
వార్తలు
దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ: సుప్రీం


