NLR: కావలి పట్టణ అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించాలనే సంకల్పంతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ కావలిలో సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు ఎమ్మెల్యేను అభినందించి సభ్యత్వ ధ్రువపత్రాన్ని అందజేశారు. ప్రజా సేవలో కలిసి పనిచేస్తూ కావలి అభివృద్ధికి తమవంతు కృషి కొనసాగిస్తామన్నారు.
వార్తలు
కావలి రోటరీ క్లబ్‌లో ఎమ్మెల్యే కావ్య


