హైదరాబాద్: 28°C
వార్తలు

నరసరావుపేటలో 'ఇంటింటికి తెలుగుదేశం'కార్యక్రమం

PLD: నరసరావుపేటలో సోమవారం రాత్రి నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. రాబోయే 45 రోజుల పాటు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడిన ఆయన, అర్హత ఉండి పథకాలు అందని వారికి తిరిగి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.