TG: ఓ భూవివాదం కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. HYD బండ్లగూడలోని 31.25 ఎకరాల భూమి నుంచి 651 మంది ఆక్రమణదారులను తొలగించి దాని యజమానులకు అప్పగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. లేదంటే ప్రభుత్వమే భూమిని సేకరించి పరిహారాన్ని యజమానులకు ఇవ్వాలని ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టేసింది. ప్రైవేటు భూవివాదంలో ప్రభుత్వం పరిహారం ఇవ్వాలనడం సరికాదని పేర్కొంది.
వార్తలు
తెలంగాణ సర్కార్‌కు సుప్రీంలో ఊరట


