హైదరాబాద్: 28°C
వార్తలు

హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం

TG: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, బోరబండ, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, అశోక్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కొన్నిచోట్ల రహదారులు జలమయమై, వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.