హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు, రేపు సింహాచలం గిరిప్రదక్షిణ.. ఏర్పాట్లు పూర్తి

AP: సింహాచలం గిరిప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జరిగే 32KM మహా యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొననున్నారు. ఇవాళ, రేపు జరిగే యాత్ర కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది 7- 8 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. మధ్యాహ్నం  2 గంటలకు తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టడంతో గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. భక్తుల కోసం RTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది.