హైదరాబాద్: 28°C
వార్తలు

'యాంటీ-పేపర్‌ లీక్‌' బిల్లుపై లోక్‌సభలో ఇవాళ చర్చ

పేపర్ లీకేజీ నిరోధక సవరణ బిల్లుపై ఇవాళ లోక్‌సభలో చర్చ జరగనుంది. దీనికి విపక్షాలు అంగీకరించాయని పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి. స్పీకర్ ఓం బిర్లా చేపట్టిన చర్యలతో.. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ బిల్లుపై చర్చకు ఒప్పుకున్నారని పార్లమెంట్ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఇవాళ 8 గంటలపాటు చర్చ జరిగే అవకాశం ఉంది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ఈ బిల్లును రూపొందించారు.