రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మాని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుందట. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతి, రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.
వార్తలు
పంట మార్పిడితో ఎన్ని లాభాలో తెలుసా?


