TG: కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి నీటి విడుదలతో గద్వాల జిల్లాలోని జూరాల డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 30 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 16,408 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.150 మీటర్లకు నీటిమట్టం చేరింది. 4 యూనిట్ల నుంచి 158 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
వార్తలు
జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద


