AP: భూ వివాదం తెలిశాక తాను సివిల్ కోర్టును ఆశ్రయించానని.. ఈ వ్యవహారంలో తాము బాధితులమే అని తమ్మినేని అన్నారు. సివిల్ కేసు ఉండగానే క్రిమినల్ కేసు నమోదు చేశారని ఆరోపించారు. తమ వివాదాలను కోర్టుకు వినిపిస్తామని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని సీతారాం చెప్పారు. కాగా శ్రీకాకుళం జిల్లాలో నకిలీ పత్రాలతో రూ.4 కోట్లు విలువైన భూమి కబ్జా చేశారని తమ్మినేనిపై కేసు నమోదైంది.
వార్తలు
న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంది: తమ్మినేని


