AP: తన కుటుంబంపై నమోదైన భూకబ్జా కేసుపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం వీడియో రిలీజ్ చేశారు. తాను ఎప్పుడూ చట్ట విరుద్ధమైన పనులను ప్రోత్సహించలేదని, చట్టాన్ని ఉల్లంఘించలేదని అందులో పేర్కొన్నారు. భూమి కొనుగోలులో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. ప్రజల విశ్వాసమే తన బలమన్నారు. చట్ట ప్రకారం పరిశీలించాకే రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు. ఈ కేసులో తమ్మినేని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వార్తలు
నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు: తమ్మినేని


