హైదరాబాద్: 28°C
వార్తలు

TDP నేతలకు లోకేష్ కీలక సూచనలు

AP: MLAలకు మంత్రి లోకేష్ కీలక సూచనలు చేశారు. MLAలు వారంలో కనీసం 4 రోజులు TDP డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించాలని లోకేష్ ఆదేశించారు. అలాగే ఇతర పదవుల్లో ఉన్నవారు కనీసం 3 రోజులు డోర్ టు డోర్ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఫలితాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. తొలిరోజే పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు.