హైదరాబాద్: 28°C
వార్తలు

కలాంకు టీడీపీ మైనార్టీ సెల్ ఘన నివాళి

PLD: TDP మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మిసైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్యాంప్ కార్యాలయంలో, రైతు బజార్ వద్ద ఉన్న కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన కలాం సేవలు, సందేశాలు యువతకు స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు.