ప్రధాని మోదీతో స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకులు పవన్ చందనా, నాగ భరత్ భేటీ అయ్యారు. 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై మోదీ వారిని అభినందించారు. స్కైరూట్ బృందంలో అధిక శాతం యువత ఉండటం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ప్రైవేట్ స్పేస్ రంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం అవుతున్నాయని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
వార్తలు
మోదీని కలిసిన స్కైరూట్ ఫౌండర్లు


