హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వరదలు.. రంగంలోకి NDRF

గుజరాత్‌లోని ధోలేరా ప్రాంతంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో భోగవో నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో వనితలావ్ గ్రామం చుట్టూ వరద నీరు చేరి, బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ నేపథ్యంలో NDRF రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.