మార్కాపురం జిల్లా పుల్లలచెరువు (మం) గంగవరంలో సోమవారం పేకాట ఆడుతున్న ముగ్గురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.6,720, 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వార్తలు
పేకాట ఆడుతున్న ముగ్గురు అరెస్ట్


