హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పీఎం శ్రీ పాఠశాలలో కూచిపూడి నృత్య ప్రదర్శన

ములుగు జిల్లా బండారుపల్లి పీఎం శ్రీ టీజీఎంఎస్ పాఠశాలలో విద్యాశాఖ సహకారంతో SPIC MACAY హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ నృత్య కళాకారిణి కత్రగడ్డ హిమాన్సీ రామాయణ విశేషాలు, దేశభక్తి అంశాలను శాస్త్రీయ నృత్యరూపంలో విద్యార్థులకు వివరించారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు ఎస్. దేవకి, ఉపాధ్యాయులు ఆమెను సన్మానించారు