హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు!

TG: రాష్ట్రంలో నిన్న జగిత్యాల(D) మెట్‌పల్లి(M) జగ్గాసాగర్‌లో అత్యధికంగా 76.8MM వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్‌లో 51.0, కందిలో 42.5, కడ్పాల్‌లో 41.3, కామారెడ్డి జిల్లా మచ్చాపూర్‌లో 40.8MM వర్షం కురిసింది. ఇవాళ, రేపు పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.