AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, విశాఖ, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది. ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 55-65KM వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
వార్తలు
అప్రమత్తం.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు


