హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతలు

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తి బాధ్యతాయుతంగా ఈ పదవిని స్వీకరిస్తున్నానని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం పట్ల తాము నిజాయితీగా, శ్రద్ధగా, నిబద్ధతో ఉన్నామని మంత్రి వెల్లడించారు. కాగా, నీట్ వివాదంతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.