MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకం, అష్టోత్తర నామార్చన నిర్వహించి, రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో విశేషంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
వార్తలు
శ్రీ నల్ల పోచమ్మకు ఆషాఢం పూజలు


