కార్గిల్ అమరవీరులకు ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. జీవితంలో కొన్ని తేదీలను గుర్తుంచుకోవడానికి క్యాలెండర్ అవసరం లేదన్నారు. 'కార్గిల్ విజయ్ దివస్.. ఈరోజు మనల్ని గర్వంతో నింపుతుంది. వీర సైనికుల అసాధారణ ధైర్యాన్ని మనకు గుర్తుచేస్తోంది. మాతృభూమిని రక్షించడానికి సైనికులు సర్వస్వం త్యాగం చేశారు. కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నా' అని పేర్కొన్నారు.
వార్తలు
ఈరోజు మనల్ని గర్వంతో నింపుతుంది: మోదీ


