హైదరాబాద్: 28°C
వార్తలు

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

KMR: మాచారెడ్డిలోని చుక్కాపూర్‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆలయానికి తరలివెళ్లారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.