హైదరాబాద్: 28°C
వార్తలు

'సేవ్ మణుగూరు' ఉద్యమానికి ప్రభుత్వ స్పందన

BDK: మణుగూరు ఓసీ-2 డీప్‌సైడ్ బొగ్గు బ్లాక్‌ను మణుగూరుకే కేటాయించాలని కొనసాగుతున్న 'సేవ్ మణుగూరు' ఉద్యమానికి ఊపు పెరిగింది. ఈ అంశంపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ బలరాం నాయక్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.