హైదరాబాద్: 28°C
వార్తలు

దోసపాడు ఛానల్‌‌లో తగ్గిన నీటిమట్టం

కృష్ణా: వర్షాభావానికి తోడు అధికారులు దోసపాడు ఛానల్‌కు నీటిమట్టం తగ్గించడంతో పొలాలు ఎండిపోతున్నాయని వెంట్రప్రగడ వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేసిన పొలాలు నీరందక విలవిలలాడుతుండగా శివారు భూముల్లో నాట్లు వేయలేక పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే వేలాది రూపాయల పెట్టుబడి పెట్టామని, వెంటనే కాలువకు నీళ్లు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతున్నారు.