హైదరాబాద్: 28°C
వార్తలు

శక్తి యాప్ పై పోలీసుల అవగాహన సదస్సు

ఏలూరు సీఆర్ఆర్ మహిళా కళాశాల హాస్టల్లో విద్యార్థినులకు శక్తి యాప్, సైబర్ నేరాలు, మహిళల భద్రత, కొత్త చట్టాలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థినులకు అత్యవసర సహాయం పొందే విధానం, సోషల్ మీడియా జాగ్రత్తలు, రోడ్డు భద్రతపై వివరించారు.