హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత

ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వర్షంలోనూ సీజేపీ కార్యకర్తలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులపైకి నిరసనకారులు వాటర్ బాటిళ్లు, చెప్పులు విసిరారు. దీంతో మరోసారి పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్యకర్తలకు జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే పలు వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు.