హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం చర్చలకు ఆహ్వానించింది: సీజేపీ

తమతో చర్చలు జరుపుతామని కేంద్రం ప్రకటించిందని CJP వెల్లడించింది. పార్లమెంట్ భవనానికి CJP కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీగా వెళ్తుండటంతో జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసన తెలుపుతున్న నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. తోపులాటల్లో కొందరు ఆందోళనకారులు, పోలీసులకు గాయపడ్డారు. ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాధికారులు పార్లమెంట్ గేట్లు మూసివేశారు.