హైదరాబాద్: 28°C
వార్తలు

విమానంలో ఏసీ ఫెయిల్.. ప్రయాణికుల ఇబ్బందులు

చండీగఢ్ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలో AC పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. విమానంలో గాలి ఆడక ఇబ్బంది పడుతూ, పేపర్లు, విసనకర్రలతో విసురుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్నా ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంపై ప్రయాణికులు యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.