ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని లాల్ టెక్డి ప్రభుత్వ గిరిజన మోడల్ రెసిడెన్సియల్ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేయడానికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ చౌహాన్ అనిల్ కుమార్ తెలిపారు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 23వ తేదీలోపు కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
వార్తలు
'అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం'


