BDK: గిరిజన భూములపై ఎలాంటి నిర్బంధాలను పెట్టినా సహించేది లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. పాల్వంచలో ఆదివారం జరిగిన టీజీఎస్ మహాసభ రెండవ రోజు ప్రతినిధుల సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐక్య ఉద్యమాలతోనే గిరిజన హక్కుల రక్షణ, న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. పాలకుల అణచివేత వైఖరిని గిరిజన లోకం ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు.
వార్తలు
గిరిజన భూములపై నిర్బంధాలను పెడితే సహించం


