హైదరాబాద్: 28°C
వార్తలు

పేకాట స్థావరాలపై దాడి... ఏడు మంది అరెస్టు

ప్రకాశం: దొనకొండ (మం)రుద్రసముద్రం గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురుని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పేకాట రాయుళ్ల నుంచి రూ. 6590 నగదు, మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిషేధిత కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.