హైదరాబాద్: 28°C
వార్తలు

25 ఏళ్లుగా కూలీలకు వెంటనే వేతనాలు

MGL: మంగపేట (M)లోన అకినేపల్లి మల్లారం గ్రామం గత 25 ఏళ్లుగా వందశాతం పనుల చెల్లింపులు చేస్తూ రాష్ట్రానికే ఆదర్శంగా ఉంది. 2002లో జరిగిన గ్రామసభలో కూలీలకు వెంటనే డబ్బులు ఇవ్వాలని తీర్మానం చేశారు. 503 ఇళ్లు, 1400 జనాభా కలిగిన ఈ గ్రామం ఇప్పటివరకు 4సార్లు జిల్లా ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకుంది. 2010లోనే ఉత్తర తెలంగాణలో వరి నాట్లు యంత్రం మొదట ఇక్కడే వాడారు.