హైదరాబాద్: 28°C
వార్తలు

'నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు'

మెదక్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే 'ప్రజావాణి' కార్యక్రమాన్ని ఈ నెల 20న రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం ఉన్నందున జిల్లా అధికారులు అందులో పాల్గొనాల్సి ఉందన్నారు. ఈ కారణంగా ప్రజావాణి బదులు కలెక్టరేట్ హెల్ప్ డెస్క్ ద్వారా వినతులు స్వీకరిస్తామన్నారు.