హైదరాబాద్: 28°C
వార్తలు

అభిషేక్ బెనర్జీ ఆఫీసును కూల్చేసిన ప్రభుత్వం

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చెందిన కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ భవనానికి ఎలాంటి అనుమతులు లేవని అందుకే కూల్చేశామని చెప్పారు. బుల్డోజర్లతో అధికారులు రావటాన్ని గమనించిన టీఎంసీ కార్యకర్తలు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకోగా.. పోలీసుల రాక అది సద్దుమణిగింది.