హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీలకు లోక్‌సభ సచివాలయం సూచన

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎంపీలకు లోక్‌సభ సచివాలయం కీలక సూచనలు చేసింది. సమావేశాలకు హజరయ్యే ఎంపీలు స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ గ్లాసులు వంటివి ధరించవద్దని సూచించింది. దీని వల్ల భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే ఎంపీలు ధర్నాలు చేయడం, ప్లకార్డులు, ఆయుధాల ప్రదర్శన వంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపింది.